Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరారీలో నిందితుడు
నవతెలంగాణ - ఓదెల
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లిలో బాలికపై లైంగికదాడి జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలిక వేసవి సెలవుల్లో అమ్మమ్మ గ్రామమైన ఉప్పరపల్లికి వచ్చింది. రోజువారీలో భాగంగా అమ్మమ్మ, తాతయ్య పనికి వెళ్లారు. ఈ సమయంలో పక్క ఇంట్లో ఉండే రమేష్ బాలికను తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. పని నుంచి ఇంటికొచ్చిన తాతయ్య, అమ్మమ్మ విషయం తెలుసుకొని వెంటనే పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి ఏసీపీ సాదుల సారంగపాణి, సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ శీలం లక్ష్మణ్ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. బాలికను పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.