Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబర్పేట డివిజన్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎనిమిదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదన్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ ఎనిమిదేండ్లలో ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధిపరంగా రాష్ట్రం పురోగతి సాధిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అంబర్పేట డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లవంగ ఆంజనేయులు, లింగ రావు, ఆమునురి సతీష్, రంగు సతీష్ గౌడ్, రంగు మహేష్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీనివాస్ గుప్త, నాగరాజు, సంతోష్ చారి, విష్ణు, దరం, దయాకర్ యాదవ్, లలిత, మహిళా నాయకులు, మైనార్టీ నాయకులు కార్యకర్తలు, అనుబంధ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.