Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) ఏపీ విశ్వవిద్యాలయంలో ఘనంగా వర్సిటీ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, గౌరవ అతిథులుగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎలక్ట్రికల్ డిజైన్ సాఫ్ట్వేర్ ష్నీడర్ డైరెక్టర్ వెంకటరమణ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రజని విశ్వవిద్యాల య వార్షిక నివేదికను ఆవిష్కరించారు. ఇన్నోవేషన్ అండ్ ఇంకుబేషన్ సెంటర్, సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆప్టింగ్స్, సైబర్ సెక్యూరిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో కొన్ని లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని కోరారు. ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని వివరించారు. 1,321 ప్లేస్మెంట్ ఆఫర్లను సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ వీఐటీ అంటే విజన్, ఎన్నోవేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అని అన్నారు. ఎలక్ట్రిక్ డిజైన్ సాఫ్ట్వేర్ ష్నీడర్ డైరెక్టర్ వెంకటరమణ వేణుగోపాల్ మాట్లాడుతూ వైఫల్యాలే భవిష్యత్తులో విజయాలకు సోపానాలని చెప్పారు. ఓడిపోయినా ధైర్యంతో ముందుకుసాగాలని సూచించారు. పుస్తకాలు బాగా చదివి ఒత్తిడిని జయించాలని విద్యార్థులను కోరారు. వీఐటీ వ్యవస్థాపకులు, చాన్సలర్ జి విశ్వనాథన్ మాట్లాడుతూ తమ విద్యాసంస్థల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్య అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఐటీ వైస్ ప్రెసిడెంట్ కె విశ్వనాథన్ ఏపీ విశ్వవిద్యాలయం వీసీ ఎస్వీ కోటారెడ్డి, రిజిస్ట్రార్ సీఎల్వీ శివశంకర్, అసిస్టెంట్ డైరెక్టర్ అనుపమ నంబూరు తదితరులు పాల్గొన్నారు.