Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా న్యాయమూర్తుల జిల్లాగా గద్వాల
నవతెలంగాణ - ధరూర్
జోగుళాంబ గద్వాల జిల్లాలో తొలి న్యాయమూర్తిగా కనకదుర్గ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే, జిల్లాలో న్యాయమూర్తులందరూ మహిళలే కావడం గొప్ప విషయం. 1వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా అన్నే రోజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా గంట కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా కర్నాటి కవిత, 1వ అదనపు సివిల్ జడ్జిగా గాయత్రి ఇప్పటికే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా భవాని, రేచల్ సంజన, బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా బి.శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి మధు, రాంబాబు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.