Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు పర్యాటకశాఖ, టీఎస్ఆర్టీసీ సమన్వయంతో పనిచేయనున్నాయి. ఈ మేరకు శుక్రవారం బస్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ బస్‌భవన్‌లో భేటీ అయ్యారు. వీరితో పాటు టూరిస్టు ఆపరేటర్ల సంఘాలు కూడా సమావేశంలో పాల్గొన్నాయి. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటక ప్రాంతాలకు ఆదరణ పెరగుతున్నదనీ, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు, సుఖవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు ఆయా శాఖలు అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులు చర్చలు జరిపారు. సమావేశంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు ఎస్కే వాల్మీకి హరికిషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఏపీ అండ్ టీఎస్) చైర్మెన్ కే రంగారెడ్డి, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్డ్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కన్వీనర్ అనురాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.