Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాండ్ల ద్వారా రుణాలను స్వీకరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి... కేంద్రం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈనెల ఏడున ప్రభుత్వం తన బాండ్లను వేలం వేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. బాండ్లను వేలం వేయటం ద్వారా రూ.53 వేల కోట్ల మేర అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అందుకనుగుణంగా ప్రస్తుత బడ్జెట్ (2022-23)లో అంచనా వేసుకుంది. అయితే గత రెండేండ్ల నుంచి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల (బడ్జెటేతర అప్పులు)పై కేంద్రం పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నది. సంబంధిత సమాచారం కావాలంటూ కోరింది. ఈ క్రమంలో అప్పులు తీసుకునేందుకు ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లభించలేదు. తాజాగా తెలంగాణ సర్కారు.. కేంద్రం అడిగిన సమాచారాన్ని ఇవ్వటంతో అప్పులు తీసుకోవటానికి వెసులుబాటు కల్పించారు.