Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈనెల 10వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా స్టూడెంట్ బస్‌పాస్‌ల దరఖాస్తులను స్వీకరిస్తామని టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇ యాదగిరి తెలిపారు. దానికంటే ముందు ఆయా పాఠశాలలు, కళాశాలలు నిర్ణీత ఫీజు చెల్లించి, తమ విద్యాసంస్థల వివరాలను తెలుపుతూ దరఖాస్తుల్ని పంపాలని చెప్పారు. కొత్త విద్యాసంస్థలకు యూజర్ నేమ్, పాస్వర్డ్, పాత విద్యాసంస్థలకు పాస్‌వర్డ్‌ను ఇస్తామన్నారు. దీనివల్ల విద్యార్థులు సకాలంలో బస్‌పాస్‌లు పొందగలుగుతారని వివరించారు. జూన్ 15 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లోని 40 కేంద్రాల ద్వారా విద్యార్థులకు బస్‌పాస్‌లు ఇస్తామన్నారు.