Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హిమాలయ పర్వతాల్లో సముద్రమట్టానికి 14,700 అడుగుల ఎత్తులోని పంగర్చుల్ల పర్వతాన్ని అధిరోహించి జాతీయ పతకాన్ని ఎగురవేసిన కొమరంభీం అసిఫా బాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ అమ్మాయి మడావి కన్నీబాయి నేతృత్వంలో బృందానికి హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ బృందంలోని ఎస్.చంద్రు, అరుణ్‌సాగర్(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), పాతకోట్ల ఉపేందర్ (రంగారెడ్డి జిల్లా), సంపంగి ఆనంద్‌బాబు (అల్లూరి సీతారామరాజు జిల్లా) కూడా అభినం దించారు. ఒక ఆదివాసీ మహిళ అత్యంత ధైర్య సాహసాలతో, పట్టుదలతో ఈ విజయం సాధిం చడం తెలంగాణకే గర్వకారణమని పేర్కొన్నారు. కన్నీబాయి బృందానికి మార్గదర్శ కత్వం వహించిన తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.రంగారావుతో దత్తాత్రేయ నేరుగా ఫోన్లో మాట్లాడి అభినందించారు.