Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఎడ్యుకేషన్ బాధ్యులు బండారు రవికుమార్, ఐద్వా ఉపాధ్యక్షులు టి జ్యోతి స్టడీ క్యాంపును ప్రారంభించినట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారాలను మోపుతున్నదని తెలిపారు. ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్నదని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసకోకుండా ఉండాలనే కుల, మత భావోద్వేగాలను రెచ్చగొడుతున్నదని విమర్శించారు. ఈ క్రమంలో ప్రజాతంత్ర మహిళా కార్యకర్తలుగా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే కాలంలో ప్రజాపోరాటాల నిర్వహణలో కీలకపాత్ర పోషించాలని కోరారు.