Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు దీనకొండ దామోదర్‌రావు, బండి పార్థసారథిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయారు. ఈమేరకు శుక్రవారం అసెంబ్లీ ఆవరణంలో రిటర్నింగ్ అధికారి వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఆరేండ్ల పూర్తి పదవీ కాలం కలిగిన పెద్దలసభకు దామోదరారావు, పార్థసారథిరెడ్డి ఎన్నికయ్యారు. ఇంకా రెండేండ్ల పదవీ కాలం ఉన్న మరో స్థానానికి వద్దిరాజు రవిచంద్ర ఎంపికయ్యారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్భంగా రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తమకు రాజ్యసభ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, రిటర్నింగ్ అధికారులు ఉపేందర్‌రెడ్డి, దుర్గాప్రసాద్, ఎమ్మెల్సీ నవీన్‌రావు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.