Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యా యుల అవార్డు కోసం కేంద్ర విద్యాశాఖ ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్య, అక్షరాస్యతకు చెందిన కేంద్ర విద్యాశాఖ http:// nationalawardtoteachers. education. gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 20 వరకు దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. ఎంళిరి54లిపిక మార్గదర్శకాల కోసం పైన పేర్కొన్న వెబ్‌సైట్‌ను సంప్రదించి పూర్తివివరాలు తెలుసుకోవచ్చని వివరించారు.