Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేలకొండపల్లిలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత
- పలుజిల్లాల్లో 45 డిగ్రీలకుపైనే నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రోహిణికార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు కొడుతు న్నాయి. ఉబ్బరం కూడా పెరిగింది. మొన్నటి వరకూ తగ్గిన ఉష్ణోగ్రతలు రెండు రోజుల వ్యవధిలోనే 45 డిగ్రీలకుపైకి చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, కొమ్రంభీమ్ అసిఫాబాద్, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ హెచ్చరికను జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆ ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికను విడుదల చేసింది. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. అదే సమయంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నేలకొండపల్లి(ఖమ్మం) 45.4 డిగ్రీలు
ఎలకపల్లి(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 45.4 డిగ్రీలు
దామరచర్ల(నల్లగొండ) 45.2 డిగ్రీలు
జైనధ్(ఆదిలాబాద్) 45.1 డిగ్రీలు
నాగులవంచ(ఖమ్మం) 45.1 డిగ్రీలు
మునగాల(సూర్యాపేట) 45.0 డిగ్రీలు
ఆదిలాబాద్ 45.0 డిగ్రీలు