Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతాధికారుల వేధింపులే కారణం?
నవతెలంగాణ- బంజారాహిల్స్
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పంజాగుట్ట పోలీసులు, ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ దువ్వూరి యాదయ్య కుటుంబంతో కలిసి నిమ్స్ ఆస్పత్రి సమీపంలోని బాలాపూర్బస్తిలో నివాసముం టున్నాడు. ఆయన కుమార్తె దువ్వూరి సరస్వతి(27) నిమ్స్ ఆస్పత్రి రేడియాలజీ విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. అయితే, శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తండ్రి యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిమ్స్ ఉన్నతాధికారుల వేధింపుల వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.