Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.12 కోట్లతో ఉడాయించిన దంపతులు
- ఆందోళనలో బాధితులు
నవతెలంగాణ-పటాన్చెరు
చిట్టీల పేరుతో పారిశ్రామిక వాడ వాసులను నమ్మించి రూ.12 కోట్లతో దంపతులు ఉడాయించారు. డబ్బులు రేపు ఇస్తాం.. మాపు ఇస్తామని నమ్మబలికి.. ఉన్నట్టుండి ఉడాయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తంగి గ్రామం, సాయి ప్రియ కాలనీలో చిట్టీల పేరుతో రమాదేవి, సాయిబాబా అనే దంపతులు సుమారు రూ.12 కోట్లను వసూలు చేశారు. సుమారు 150 మంది నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ.2 నుంచి 10 లక్షల వరకు చిట్టీల పేరుతో వసూలు చేశారు. అయితే చిట్టీ డబ్బులను ఏడాదికి పైగా రేపు ఇస్తా.. మాపు ఇస్తామని నమ్మబలికి ఉన్నటుండి ఉడాయించారు. లబోదిబోమన్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులే తమకు న్యాయం చేసి డబ్బులు ఇప్పించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.