Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాల్ పోస్టర్లు విడుదల చేసిన జూలకంటి
నవతెలంగాణ -మిర్యాలగూడ
కౌలు రైతుల రాష్ట్ర సదస్సు 5వ తేదీన మిర్యాలగూడలోని ఏఆర్సీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాల గూడ పట్టణ కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో శుక్రవారం సదస్సు వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. ఈ సదస్సుకు అన్ని జిల్లాల నుంచి సుమారు 400 మంది కౌలు రైతులు హాజరవుతున్నట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి కౌలు రైతులు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు. కౌలు రైతులకు బీమా సౌకర్యం కల్పించాలని, బ్యాంక్ రుణాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరబల్లి వెంకటేశ్వర్లు, నాయకులు శశిధర్ రెడ్డి, పాల్వాయి రాంరెడ్డి, అవాజ్ జిల్లా అధ్యక్షులు ఎండి.అంజాద్ తదితరులు పాల్గొన్నారు.