Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిట్కుల్ సర్పంచ్ నేషనల్ సేవా రత్న అవార్డు గ్రహీత నీలం మధు ముదిరాజ్
- ఘనంగా మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలు
- మంత్రి పుట్టినరోజున ఆడపిల్ల పుడితే రూ.50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్
- 17 మంది ఆడపిల్లల తల్లులకు 5వేలు అందజేత
నవతెలంగాణ-పటాన్చెరు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు శర వేగంగా అభివృద్ధి చెందుతున్నా యని చిట్కుల్ సర్పంచ్, నేషనల్ సేవా రత్న అవార్డు గ్రహీత నీలం మధు ముదిరాజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టినరోజును పురస్కరించుకొని నీలం మధు ముదిరాజ్ యు వసేన ఆధ్వర్యంలో మధు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో.. జనవరి నుంచి మే చివరి వరకు గ్రామంలో జన్మించిన 17 మంది ఆడపిల్లలకు నీలం మధు ముదిరాజ్ యువసేన అందిస్తున్న రూ.ఐదువేలను సర్పంచ్ నీలం మధు వారి తల్లులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా గ్రామంలో ఆడపిల్ల పుడితే వారికి రూ.50 వేలు డిపాజిట్ చేస్తానని తెలిపారు. మంత్రి హరీశ్‌రావు చేస్తున్న సేవా కార్యక్రమా లను ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాలు కొన సాగిస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ పవర్ హాలిడేతో రెండు, మూడు రోజులు పనులు కోల్పోయేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వంటి ఎన్నో పథకాలతో రాష్ట్రంలో సంక్షేమం కొన సాగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎస్ఆర్డీపీ కార్యక్రమం తెచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ అనిపించుకున్నారన్నారు. సమస్యలు పరిష్కారం చేసే ట్రబుల్ షూటర్ లా మంత్రి హరీశ్‌రావుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశారని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ నారాయణ రెడ్డి, వార్డు సభ్యులు కృష్ణ, బుజంగం, శ్రీను, మురళీ, వెంకటేష్, రాజకుమార్, ఆంజనేయులు, తెరాస గ్రామ అధ్యక్షులు ప్రశాంత్, నాయకులు వెంకటేష్, నారాయణ రెడ్డి, వీహెచ్ అనిల్, గ్రామ పెద్దలు, ఎన్ఎంఎం యువసేన సభ్యులు పాల్గొన్నారు.