Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే కుల దురంహకార హత్యలపై స్పందించట్లేదు
- ప్రేమవివాహాలు చేసుకునేటోళ్లకు రక్షణ కల్పించాలి
- కేరళ తరహాలో రక్షణ గృహాలు ఏర్పాటు చేయాలి
- నోక్యాస్ట్, నోరిలీజియన్ సర్టిఫికెట్ల కోసం యువత ముందుకు రావాలి : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'దేశంలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. కుల, మత జాఢ్యం రోజురోజుకీ పెరిగిపోతున్నది. కాలేజీల్లో కుల, మత సంఘాలేంటి? విద్యార్థుల మధ్య చీలికలేంటి? అసలు కుల, మత సంఘాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా పెంచిపోషిస్తున్నది రాజకీయ పార్టీలే. అందుకే కుల దురంహకార హత్యలపై నేత లు స్పందించట్లేదు. ఎక్కడ ఆ కుల సంఘం ఓట్లు దూరం అవుతాయో అన్న భయంతోనే వెనుకడుగు వేస్తున్నారు. దేశంలో ప్రేమవివాహాలు చేసుకునేటో ళ్లకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. కేరళ తరహాలో రక్షణ గృహాలు నిర్వహించాలి. అక్కడి మాదిరిగా నోక్యాస్ట్, నోరిలీజియన్ సర్టిఫికెట్ల కోసం యువత ముందుకు వస్తే మనుషుల మధ్య విద్వేషపూరిత అంతరాలు తొలగిపోయి అభివృద్ధివైపు అడుగులు పడే అవకాశం ఉంటుంది' అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా, ట్రాన్స్‌జెండర్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యం లో 'కుల, మతాంతర వివాహాలు..హత్యా రాజకీయాలు' అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పిల్లలకంటే కు లం, మతం ఎక్కువ అనే ధోరణి తల్లిదండ్రుల్లో ఇటీ వల బాగా పెరిగిపోతున్నదనీ, తల్లిదండ్రులు కాస్త సానుకూల వైఖరితో ఉండాలని చూసినా ఇరుగు పొరుగు వారు, సమాజం వారిని అలా ఉండనివ్వట్లే దని ఆందోళన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి పట్ల ఇలా వ్యవహరించడాన్ని సమా జం అమోదిస్తుండటం వల్లనే ఇలా జరుగుతున్నది చెప్పారు. మహిళను ఒక ఆస్తిగా చూసే ధోరణి పోవాలన్నారు. ప్రతి ఒక్కరూ అభ్యుదయంగా ఆలోచించే రోజులు రావాలని ఆకాంక్షించారు. ఓ మహిళ ఇష్టమైన వ్యక్తిని వివాహమాడితే అడ్డుక్కునే హక్కు ఇతరులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్లకు ప్రేమ విహహాలపై కౌన్సిలింగ్ ఇచ్చే ప్రక్రియ మరింత దృఢంగా తయారు కావాలని అభిప్రాయపడ్డారు. ప్రేమపెండ్లీండ్లు చేసుకునే వారి రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఒక పాలసీ ఉండాలని సూచించారు. బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తున్నామని చెప్పారు. అన్ని సందర్భాల్లోనూ శిక్షలు పడటం వల్లనే న్యాయం జరుగదనీ, మనుషుల ఆలోచనా విధానా ల్లోనే మార్పులు రావాలని అన్నారు. ప్రొఫెసర్ రమా మేల్కొటే మాట్లాడుతూ.. చట్ట ప్రకారమే అమ్మాయి, అబ్బాయి ఇష్టపడి ప్రేమ పెండ్లిండ్లు చేసుకుంటే కులాలు, మతాల పేరిట అడ్డుకుని హత్యలు చేయడం సంస్కృతి ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆడపిల్లలు కూడా మనుషులేననీ, వాళ్లకు వ్యక్తిగత ఇష్టాఇష్టాలుంటాయని చెప్పారు. గౌరవం, ప్రతిష్ట ముసుగులో ముక్కూమొహం తెలియనోడికి లక్షలకు లక్షలు కట్నం ధారబోసి అమ్మాయిలను కట్టబెట్టి వాళ్ల జీవితాలను ఆగం చేస్తున్నారనీ, అదే ఇష్టపడి పెండ్లి చేసుకున్న వ్యక్తులను నరికి చంపడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేమవివాహాలు చేసుకుని తమ కుటుంబ సభ్యుల చేతుల్లో తమ భర్తలను కోల్పోయిన బాధితులు అస్రీన్(నాగరాజు భార్య), సంజనా(నీరజ్‌కుమార్ భార్య), అవంతి(హేమంత్ భార్య), దాడులకు గురైన మాధవి తదితరులు మాట్లాడుతూ..తమ భర్తలను చంపితే వాళ్ల పరువు తిరిగి వచ్చిందా? అని ప్రశ్నించారు. మనిషి మనిషి లా ఆలోచించాలని కోరారు. కుల,మత పిచ్చి దేనికి పనికొస్తాయని ప్రశ్నించారు. ఆస్పత్రిపాలైనప్పు డు ఏ డాక్టర్ అయితేనేం ప్రాణాలు కాపాడాలని కోరు కుంటాంగానీ, తమ కులం, మతం వారే వైద్యం చేయాలని ఎవరైనా అడుగుతారా? అని నిలదీశారు. సమాజంలోని కులపిచ్చి తమ పిల్లలనే తల్లిదండ్రులు చంపే దాకా వచ్చిందన్నారు. తాము ఏరికోరి పెండ్లి చేసుకున్న వారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న తమను కోర్టుల చుట్టూ తిప్పడం, తల్లిదండ్రులే కదా వెనక్కి తగ్గాలని సూచనలు చేయడం, తమ వ్యక్తి త్వాన్ని సమాజంలో చెడుగా చూపెట్టడం తదితర పరిణామాలు తమను ఇంకా కుంగుబాటుకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని మరో అమ్మాయికి జరుగకుండా తమ వంతు పోరాడుతామని చెప్పారు. ఆయా కేసుల్లోని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో వేగం కేసులను పరిష్కరించాలి..బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలి..సేప్టీ హోంలను నిర్వహించాలి..తదితర తీర్మానాలను చేశారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ సంధ్య, రుక్మిణీరావు, కులనిర్మూలన సంఘం ఉపాధ్యక్షులు జ్యోతి, గడ్డం ఝాన్సీ(దళిత్ స్త్రీ శక్తి), ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, కొండవీటి సత్యవతి, ఖలీదా పర్వీన్, ఎం.రచన, మీరా సంఘమిత్ర, గాదె ఝాన్సీ, సజయ, సుమిత్ర, దీప్తి, బండారు విజయ, వి.పద్మ, తదితరులు పాల్గొన్నారు.