Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు కోవిడ్ నిబంధలు పాటించాలి : మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలనీ, బోధనాస్పత్రుల వరకు అన్ని ఆస్పత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శనివారం కోఠిలోని టీఎస్ఎంఐడీసీ కార్యాలయంలో, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. అమెరికాలో రోజుకు లక్ష కేసులు, ఉత్తర కొరియాలో రోజుకు 80 వేలు, జర్మనీలో రోజుకు 50 వేల కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో పాజిటివిటీ రేటు 75 శాతం పెరిగింది. దేశంలో 21,055 కేసులు గత వారం నమోదయ్యాయని తెలిపారు. శుక్రవారం నాలుగు వేల కేసులు వచ్చాయన్నారు. 23 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడులో కేసులు రెట్టింపు అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో పాజిటివీటీ రేటు పెద్దగా లేదన్నారు. గత వారంలో 0.4 శాతం (280 కేసులు)గా ఉన్న పాటిజివ్ రేటు ఈ వారం 0.5 శాతానికి (375 కేసులు) పెరిగాయన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉందనీ, నియంత్రణలోనే ఉన్నప్పటికీ సిబ్బంది వైద్య సిబ్బంది అలసత్వంతో ఉండొద్దని సూచించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలనీ, గుంపులు, గుంపులుగా తిరగొద్దనీ
వ్యాక్సినేషన్ వేగం పెంచాలి
రాష్ట్రంలో 33 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వారందరి ఇంటికి వెళ్లి టీకా ఇవ్వాలని ఆరోగ్య కార్యకర్తలను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, టీఎస్ ఎం ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హెల్డ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ శ్వేతా మహంతి, డీహెచ్.శ్రీనివాస్ రావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజరు కుమార్, డీఎంఈ రమేష్ రెడ్డి , వాక్సినేషన్ ఇన్ చార్జి సుధీర్ రావు పాల్గొన్నారు.