Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషలిస్టు పార్టీ నేత తంపన్ థామస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజకీయాల్లో మార్పు వచ్చినప్పుడే ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని సోషలిస్టు పార్టీ (ఇండియా) జాతీయ అధ్యక్షులు తంపన్ థామస్ అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో థామస్ అధ్యక్షతన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం దేశాన్ని అప్పులకుప్పగా మారుస్తున్నదని విమర్శించారు. రైతుల సమస్యలు పెరిగిపోతున్నా కేంద్రం కర్షకత్వాన్ని వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి రాష్ట్ర కన్వీనర్ నూరుల్ ఆమిన్, జాతీయ ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల తిరుమల్ తదితరులు స్వాగతం పలికారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న పార్టీ మహాసభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాండే,మాజీ జాతీయ అధ్యక్షులు పన్నలాల్ సురాన, హారవిందర్ సింగ్ మన్సయ్య, సుభద్ర రెడ్డి, సురేఖ, అడమ్స్ తదితరులు పాల్గొన్నారు.