Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ కార్యదర్శి రజిని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జాతీయ కార్యదర్శి డాక్టర్ కె రజిని పిలుపునిచ్చారు. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అసమానతలను అరికట్టి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చైతన్య పరచడానికి అంతరాలు లేని సమాజ స్థాపనకు ముందుండి పోరాటాలు నిర్వహించాలన్నారు.ఎన్ఎఫ్ఐడబ్ల్యూ 68వ ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జెండాను రజిని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల స్వేచ్ఛ సమానత్వం అభివృద్ధి, సాంఘిక న్యాయం సాధించడానికి మహిళలు హక్కులు సాధించాలని చెప్పారు. అప్పుడే మహిళల మనుగడ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా ఫోరం కన్వీనర్ ప్రేంపావని, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చాయా దేవి, కృష్ణకుమారి కార్యవర్గ సభ్యులు ఎండీ ఫైమిద, పూర్ణిమ, హైమావతి, కమల తదితరులు పాల్గొన్నారు.