Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్రంలోని మెదక్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ కేంద్రాల్లో ఇంటి వద్దనే బంగారం తనఖా రుణాల జారీ ప్రారంభించామని రుపీక్ తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో తమ ఈ సేవలు విజయవంతం అయ్యాయని తెలిపింది. ఈ క్రమంలోనే మరిన్ని కొత్త పట్టణాల్లో ఇంటి వద్దనే పసిడి రుణాల సేవలను అందుబాటులోకి తెచ్చామని ఆ సంస్థ పేర్కొంది. నెలకు కనీస వడ్డీ రేటు 0.49 శాతంగా ఉంటుందని వెల్లడించింది.