Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శికి టిప్స్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి (టిప్స్) డిమాండ్ చేసింది. ఈ మేరకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను శనివారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్ కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ జాబితాను ప్రభుత్వానికి త్వరగా వచ్చే విధంగా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ విద్యలో ఎదురవుతున్న సమస్యలను విద్యాశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తికి ఆమె సానుకూలంగా స్పందించి త్వరలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475 నాయకులు కోట్ల శైలజా రెడ్డి, కె మనోహర్, ఎన్ రవీందర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.