Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోనే తొలి సమావేశం- రోనాల్డ్ రోస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల విద్యార్థులకు ప్రతిభా సామర్ద్యాలు పెంపొందించే ఉద్ధేశంతో శనివారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఆయా సంస్థల అధికారులతో ఫ్రాన్స్ బృందం భేటీ అయింది. విదేశాల్లో ఉద్యోగావకాశాలు, నిపుణత, ప్రతిభా సామర్ధ్యాలను పెంపొందించటం, ఫ్రెంచి భాషలో శిక్షణ, తదితరాంశాల్లో విద్యార్ధులకు అవగాహన పెంపొందించెందుకు ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ థియెర్రి బెర్తెలాట్ నేతృత్వంలో ఫ్రెంచ్ ప్రతినిధి బందం ఈ భేటీని నిర్వహించింది. ఈ సమావేశంలో షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా చోంగ్తు, గిరిజన, షెడ్యూల్డు కులాల రెసిడెన్షియల్ సంస్థల కార్యదర్శి రోనాల్డ్ రోస్ లు పాల్గొన్నారు. ఫ్రెంచ్ ప్రతినిధుల బందంలో అలయన్స్ ఫ్రాన్కైస్ డైరెక్టర్ శామ్యూల్ బెర్తేట్, సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ గెరార్డ్ ఫ్రాంకోయిస్ ఇనిజాన్, మోనిన్ ఇండియా ప్రైవెట్ లిమిటెడ్ డైరెక్టర్ జెర్మైన్ అరౌద్ లు హాజరయ్యారు. ''ప్రభుత్వ సంక్షేమ విద్యా సంస్థలు, గ్లోబల్ కార్పొరేషన్ల మధ్య ఈ విధమైన సమావేశం జరగడం దేశంలోనే మొట్ట మొదటిదని రోనాల్డ్ రోస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.