Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి ఆవేదన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్దీకరణ కోసం సిద్ధం చేసిన జాబితాను ప్రభుత్వానికి పంపించడంలో ఇంటర్మీడియట్ కమిషనర్ కార్యాలయం జాప్యం చేయడం పట్ల తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పరిగణలోనికి తీసుకోకుండా లేని సమస్యలు సృష్టించి కాంట్రాక్టు అధ్యాపకుల (జనరల్, వొకేషనల్) జాబితాను పంపించడంలో ఆలస్యం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమడటం సరికాదని పేర్కొంది. ఈ విషయమై ''స్పాట్ వాల్యుయేషన్'' అనంతరం అన్ని సంఘాలతో చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించింది.