Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్
నవ తెలంగాణ - పాన్గల్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తి విఫలమయ్యాయాని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, గొర్రెల, మేకల కాపరుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్ అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం రేమద్దుల గ్రామంలో శనివారం రాత్రి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఫయాజ్ మొదటి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 16 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో నిరుద్యోగులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డివైఎఫ్ఐ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. బీజేపీ మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టి యువతను పక్కదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాలను భర్తీ చేయకుండా తూతూ మంత్రంగా అరకొర ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలకు, యువతీయువకులకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జబ్బార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ రెడ్డి నాయకులు జి.దేవేందర్, వేణుగోపాల్, ఎం.బాల్యనాయక్, కె.వెంకటయ్య, ఎం.వెంకటయ్య, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు భగత్, నాయకులు కమలాకర్ భాస్కర్ పాల్గొన్నారు.