Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
- హన్మకొండలో భారీ ప్రదర్శన, ధర్నా
నవతెలంగాణ-హనుమకొండ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి కలెక్టర్ల ద్వారా అర్హులను ఎంపిక చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. సోమవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిలా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం హన్మకొండ కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట అనంతరం కాళోజీ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహి ంచారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మంద సంపత్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో స్కైలాబ్ బాబు ప్రసంగించారు. రాష్ట్ర ప్రభు త్వం లబ్దిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించి అర్హులకు అన్యా యం చేస్తూ అధికార పార్టీ అనుయాయులకు వరంగా అందిస్తుందన్నారు. దళిత బంధు రాజకీయ పథకమా? ప్రభుత్వ పథకమా అని ప్రశ్నించారు. ప్రస్తుతం నియోజకవర్గానికి 1500 మంది చొప్పున కేటాయించిన లబ్దిదా రులను కలెక్టర్లకు అధికారం ఇచ్చి గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్నారు. టీఆర్ఎస్ పాలనలో దళితులకు అడు గడుగునా అన్యాయమే జరిగింద న్నారు. దళితబంధును పారదర్శకంగా అమలు చేయకపోతే ప్రగతిభవన్ వరకు దండయాత్ర చేపడుతామని హెచ్చరించారు. కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరూరి కుమార్, మాజీ జిల్లా కార్యదర్శి టి.ఉప్పలయ్య, జిల్లా కార్యదర్శి మంద సంపత్ మాట్లాడారు. వరంగల్ నగరం సుమారు లక్ష దళిత కుటుంబాలున్నాయని, అర్హుల ఎంపికలో అన్యాయం చేయొద్దన్నారు. రాజకీయ దురుద్దేశంతో కాకుండా రాజకీయలకతీతంగా దళితబంధు అమలు చేయాలన్నారు. హన్మకొండ నగరంలో 25 దళిత వాడలున్నాయని, బస్తీ ల వారీగా సభలు పెట్టి ఎంపిక చేయాలని సూచించారు. అనంతరం జిల్లా రెవె న్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమములో గిరిజసంఘం జిల్లా అధ్యక్షులు డి.బాను నాయక్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు గబ్బెట రాంకుమార్, నాయకులు ఓ సాంబయ్య, గాదె రమేష్, దూడపాక రాజేందర్, రఘుపతి, ప్రసన్న దయాకర్ రఘుమొహన్, గడ్డం అశోక్ పాల్గొన్నారు.