Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి గీతారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన వీడియోలను బహిర్గతం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గీతారెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం గాంధీభవన్‌లో ఆమె మీడి యాతో మాట్లాడారు.ఆ చర్య ద్వారా రఘునందన్ బాధిత కుటుంబాన్ని బయ ట తిరగకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయనీ, ఎంఐఎం నాయకులతో రఘునందన్‌రావుకు పరిచయాలు ఉన్నాయని తెలిపారు.నిందితుడు దుబారుకు ఎలా వెళ్లగలిగాడని ఆమె ప్రశ్నించారు.పోలీసులు ప్రశ్నించే వారిని హౌజ్ అరెస్ట్ చేసేందుకే పోలీసులు ఉన్నారు...తప్ప నిందితులను పట్టుకునేందుకు పనికి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.