Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జూబ్లిహిల్స్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించి పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్యపై అసభ్యకర, తప్పుడు ట్రోలింగ్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, నాయకులు కె.గోవర్థన్ ఐఎఫ్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జి.అనురాధ ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతమంది శాడిస్టులు, జులాయిలు ఈ ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక, మతోన్మాదులు, ప్రగతినిరోధక మనస్థత్వం కలిగిన వారి వ్యక్తిత్వ దిగజారుడు తనానికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచత్వాన్ని మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.