Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులతో అతలాకుతలం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.పెట్రోల్,డీజిల్పై అత్యధికంగా పన్నులు వేసి ప్రజల నడ్డి విరిచారనీ,ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి చేరారం టూ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా ప్రతినిధులు చేసిన పనులకు ఏడాది కావస్తున్న బిల్లులెందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.రాష్ట్ర ఆదాయ ం,అప్పులు,ఖర్చులు,చెల్లిస్తున్న వడ్డీలు తదితర ఆర్థిక వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపనుందని తెలిపారు.
సర్పంచులకు ఎర్రబెల్లి ముఖమెందుకు చాటేశారు?
సర్పంచులను హైదరాబాద్కు రమ్మని పిలిచిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖమెందుకు చాటేశారని భట్టి ప్రశ్నించారు. నిధులు రాక సర్పంచులు తీవ్ర ఆందోళనలో ఉంటే బిల్లులు పెండింగ్ లేవంటూ ఎర్రబెల్లి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు సైతం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని తెలిపారు.
బేషరతుగా విడుదల చేయాలి
లైంగికదాడి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలిపిన మహిళ,యూత్ కాంగ్రెస్,ఎన్ఎస్ యూఐ నాయకులను అరెస్ట్ చేశారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.వరస లైంగిక దాడులు జరుగుతండటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.