Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అనాదిగా వివక్షకు, నిరాదరణకు గురైన ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ''దళితబంధు'' పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసిందని షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. పథకం అమలు తీరుపై హైదరాబాద్ లోని ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇది అద్భుతమైన పధకమని తెలిపారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందటానికి మంచి అవకాశమన్నారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహూల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు 24,046 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని,35,642 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని వారు తెలిపారు. ఇందుకు రూ.3,048 కోట్లు ఖర్చయ్యాయని రాహుల్ బొజ్జా మంత్రికి చెప్పారు. వీటిలో హూజూరా బాద్ నియోజకవర్గంలో 11,647,ఆలేరు నియోజకవర్గానికి చెందిన వాసాలమర్రిలో 71,చింతకాని,తిర్మలగిరి,చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో కలిపి 6,685,అన్ని జిల్లాల్లో కలిపి 8,507 యూనిట్లు, మొత్తంగా 24,046 గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. ఈ పథకం గురించి మరింత అవగాహన కల్పించాలని,లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించే విధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.