Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్యభర్తల వివాదం కేసులో చట్టాన్ని ఉల్లంఘించినట్టు శిక్ష విధించిన హైకోర్టు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నగరానికి చెందిన సీనియర్ ఐపీఎస్‌తో సహా నలుగురు పోలీసు అధికారులకు నాలుగు నెలల పాటు జైలు శిక్షను విధిస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శిక్ష పడినవారిలో నగర జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) ఏ.ఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లిహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ నరేశ్ లు ఉన్నారు. గతంలో జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జక్కా వినోద్ కుమార్ రెడ్డి, ఆయన భార్య సౌజన్య రెడ్డిల మధ్య జరిగిన వివాదం చోటు చేసుకున్నది. దీంతో సౌజన్య రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తనపై కేసు పెట్టడాన్ని సహించలేక వినోద్ కుమార్ రెడ్డి అతని భార్య తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. దాంతో జూబ్లిహిల్స్ పోలీసులు వినోద్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే, ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీఆర్పీసీ 41 కింద తనకు నోటీసులు జారీ చేయలేదని వినోద్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు అప్పటి పశ్చిమ మండలం డీసీపీ, ప్రస్తుత జాయింట్ కమిషనర్ ఏ.ఆర్ శ్రీనివాస్, సుదర్శన్, రాజశేఖర్ రెడ్డి, నరేశ్‌లు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. దానిపై పై అధికారులు స్పందించకపోవటం పట్ల హైకోర్టు సీరియస్ అయింది. అంతేగాక, పై నలుగురు అధికారులకు నాలుగు నెలల పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువర్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవటానికి నాలుగు వారాల పాటు నలుగురు అధికారులకు గడువిచ్చింది.