Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనాధ బాలికపై నెక్లెస్ రోడ్డులో లైంగిక దాడి
- నిందితుడి అరెస్టు.. పోస్కో కేసు నమోదు
నవతెలంగాణ-బేగంపేట్
జూబ్లీహిల్స్, పహడీశరీఫ్లో జరిగిన ఘటనలు మరవకముందే హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్డులో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుజూసింది. పుట్టిన రోజువేడుకల్లో ఓ అనాధ బాలికపై యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. రాంగోపాల్‌పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండలోని ఓ హాస్టల్లో ఉంటున్న బాలిక స్థానిక కళాశాల లో ఇంటర్ ఫిస్టయర్ చదువుతోంది. ఈ క్రమంలో మల్లేపల్లి, విజయ నగర్ కాలనీ ప్రాంతంలో జిరాక్స్ సెంటర్లో పనిచేసే సురేష్(23), బాలిక(17)తో పరిచయం చేసుకున్నాడు. కొద్దిరోజులు మంచివాడిగా నటించిన అతను బాలికకు సెల్‌ఫోన్ కొనిచ్చాడు. ఇదిలావుండగా, గత ఏప్రిల్ 20వ తేదీన కళాశాలకు వెళ్తున్నానని హాస్టల్ వార్డెన్‌కు చెప్పిన బాలిక మరో ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి క్లాస్మెంట్ పుట్టిన రోజు వేడుకకు వెళ్తూ సురేష్‌ను కలిసింది. అదే రోజు 12గంటల సమయంలో నెక్లెస్‌రోడ్డులో స్నేహితులు పుట్టిన రోజు వేడుక చేసుకున్నారు. అదే అదునుగా భావించిన సురేష్ బాలికతో మాట్లాడేం దుకని చెప్పి పక్కకు తీసుకెళ్లాడు. అక్కడున్న కారులో ఎక్కించి.. లైంగికదాడి చేశాడు. విష యం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దాంతో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గోల్గొండ ప్రాజెక్టు ఐసీడీఎస్ సూపర్వైజర్ హుమాయున్‌నగర్ పోలీసులకు ఈనెల 4న ఫిర్యాదు చేశారు. హుమాయున్‌నగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి రాం గోపాల్పేట్ పోలీసులకు పంపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సురేష్‌పై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.