Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2011 కౌలు చట్టం ప్రకారం రుణ అర్హత కార్డులివ్వాలి
- 13,14 తేదీల్లో మండల కార్యాల ముందు ధర్నాలు
- విలేకర్ల సమావేశంలో జూలకంటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'రాష్ట్రంలో కౌలు రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. భూ యజమానులు తమకు ఇష్ట మొచ్చిన రీతిలో కౌలు పెంచుతున్నార'ని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కౌలు రైతు లు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. కౌలు రైతుల ను గుర్తించటానికి ప్రభుత్వం నిరాకరించటం దారుణ మని చెప్పారు. దీంతో వారికి ప్రభుత్వ పథకాలు ఏమీ అమలు కావటం లేదన్నారు. సోమవారం హైద రాబాద్లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లా డుతూ రైతుల ఆత్మ హత్యల్లో సగం మంది కౌలు రైతులేనని తెలిపారు. భూసారాన్ని బట్టి కౌలు రేటు ను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. 2011 కౌలు చట్టం ప్రకారం వారికి రుణ అర్హత కార్డులివ్వాలన్నా రు. కౌలు రైతులందరికీ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని గుర్తు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు సూర్యా పేటలో ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. వారి సమ స్యల పరిష్కారం కోసం ఈ నెల 13,14 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలి పారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పో రాటాలు సాగుతాయన్నారు. ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారం పల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ కౌలు రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహ రిస్తున్నదని విమర్శించారు. చట్టాలు ఎప్పటినుంచో ఉన్నాయి, వాటిని అమలు చేయటంలో కేసీఆర్ ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. రెవె న్యూ చట్టాలతో ప్రభుత్వం ఆటలాడుకోవద్దని హెచ్చ రించారు. కౌలు రైతులను కేరళ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నదని చెప్పారు. తెలంగాణ లో వారు వివక్షకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారికున్న చట్టాన్ని అమలు చేయటంలో ప్రభుత్వం తమ విద్యుక్త ధర్నాన్ని పాటించాలని తెలిపారు.సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ కౌలు రైతుల రాష్ట్ర స్థాయి సదస్సులో వారి సమస్యల పరిష్కారం కోసం పలు తీర్మానాలు చేసినట్టు తెలిపారు. వారికి కనీస రక్షణ కరువైం దన్నారు. రుణ అర్హత కార్డులు కూడా ఇవ్వటం లేదని చెప్పారు. రైతు బీమా, రైతు బంధు,రుణమాఫీ వీరికి వర్తించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కౌలు రేటుతోపాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇతర పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పారు. దీంతో అనేక మంది కౌలు రైతులు ఆత్మ హత్య చేసుకుంటున్నారని తెలిపారు. సాగు భూమిలో 30శాతం కౌలు రైతుల ద్వారానే సాగవుతు న్నదని చెప్పారు.జూన్ 13,14 తేదీల్లో జరిగే మండల కేంద్రాల ధర్నాలకు కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమాలను చేపట్టాలని సదస్సు నిర్ణయించినట్టు తెలిపారు.