Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోల్కొండ బోనాలతో ప్రారంభం
- నిర్వహణ కోసం రూ.15 కోట్లు విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ నెల 30 నుంచి బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి అధ్యక్షతన బోనాల ఉత్సవాల నిర్వహణపై సమావేశం జరిగింది. హౌంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ప్రభుత్వ విప్ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మ, హౌం శాఖ ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బేతి సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, కలెక్టర్లు శర్మన్, అమరు, వాటర్ వర్క్స్ ఎమ్డీ దాన కిషోర్, పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ నెల 30 న గోల్కొండ బోనాలు, జులై 17 న సికింద్రాబాద్, 24 వ తేదీన హైదరాబాద్ బోనాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ బోనాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని తెలిపారు. సుమారు 3 వేల దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రోడ్లు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో దేవాలయాల పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పోలీసుబందోబస్తు, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.