Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భక్తులకు అన్నదాన కార్యక్రమం
నవ తెలంగాణ వెల్దండ
వెల్డండ మండల పరిధిలోని కొట్ర గ్రామంలో భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండలి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పుణ్యహావచనం, అభిషేకం, గణపతి, నవగ్రహ మన్య సూక్త హోమం, భక్తాంజనేయ స్వామి సహస్ర నామావళి కార్యక్రమాలతో పాటు తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిందని అన్ని మతాలను సమానంగా చూస్తూ దాని విద్య వైద్యం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అనంతరం దేవాలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ నిర్మాణం చేపట్టడం కోసం నిర్విరామంగా కృషి చేసిన గ్రామ వెంకటేశ్వరరావు రుక్మిణి దంపతులకు భక్తులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ భాస్కర్ రావు, ఎంపీటీసీ రాములు, వార్డు సభ్యులు విష్ణువర్ధన్ రావు, భూపతి రావు, కిషన్ రావు, శేఖర్ రావు, శ్రీనివాస రావు, వెంకోజి, గోపాల్ రావు, పీకే రావు, సుధాకర్ రావు, పురుషోత్తం రావు, కృష్ణారావు, యుగంధర్ రావు, కర్ణాకర్ గౌడ్, ఆకారం నాగరాజు, జూలూరి రమేష్, రామచంద్రయ్య, కృష్ణయ్య, జంగయ్య యాదవ్, సత్యనారాయణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.