Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎమ్.రాఘవయ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైల్వేలో పాత పెన్షన్ విధానాన్ని సాధించేందుకోసం ఆ శాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలని ఎన్ఎఫ్ఐఆర్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఫ్‌ు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎమ్.రాఘవయ్య పిలుపునిచ్చారు. 'రైల్ కర్మాచారి ఆక్రోశ్'లో భాగంగా సోమవారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవయ్య మాట్లాడుతూ... రైల్వే ప్రయివేటీకరణ, సంస్థ ఆస్తులను అమ్మటం తదితర చర్యలకు కేంద్రం పూనుకోవటం దారుణమన్నారు. వీటికి వ్యతిరేకంగా ఉద్యోగులందరూ పోరాడాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ విజృంభించిన సమయంలోనూ, ఆ తర్వాతా రైల్వే ఉద్యోగులు, సిబ్బంది... ప్రయాణీకులకు నిబద్ధతతో సేవలందించారని చెప్పారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 3,500 మంది ఉద్యోగులు కరోనా సోకి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయా కుటుంబాలకు ఇప్పటి వరకూ ఎక్స్‌గ్రేషియో ఇవ్వకపోవటం బాధాకరమని అన్నారు. ఇలాంటి సమస్య లపై ఆందోళనకు శ్రీకారం చుడతామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.