Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు టి.లింగారెడ్డి
నవతెలంగాణ- కాజీపేట
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగో న్నతుల షెడ్యూల్ను వెంటనే ప్రకటించి సమస్యలు పరిష్కరించాలని యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు, డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. యుఎస్పీసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎస్సెస్సీ స్పాట్ కేంద్రం ఫాతిమా హైస్కూల్ ఫాతిమానగర్ వద్ద యుఎస్పీసీ ఉమ్మడి వరంగల్ జిల్లాల స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
జీవో 317లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ఏడేండ్లుగా పదో న్నతులు, నాలుగేండ్లుగా బదిలీలు లేక విద్యా వ్యవస్థ కుంటుపడుతోందన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. జూన్ మూడో వారంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిం చారు టీపీటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అతి తక్కువ నిధులను కేటాయిం చడం.. నిర్లక్ష్యం చేస్తూ విద్యావ్యవస్థ కుంటుపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. నిరసన ప్రదర్శనలో యుఎస్పీసీ వివిధ భాగస్వామ్య సంఘాలు టియస్ యుటిఎఫ్, టిపిటిఎఫ్, డిటిఎఫ్ బాధ్యులు సిహెచ్ రవీందర్ రాజు, రఘుపతి, శ్రీని వాస్, రాజు, సత్యనారాయణ, సుదర్శనం, మురళీ కష్ణ, వెంకటేశ్వర్లు, గోవిందరావు, శ్రీనివాస రావు, చొక్కయ్య, రాజు రమణారెడ్డి, నటరాజ్, రమేష్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.