Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పులకు ఎస్సీ స్టూడెంట్స్, హాస్టల్స్ ఆర్గనైజేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోటీ పరీక్షల కోసం నిర్వహిస్తున్న పౌండేషన్ కోర్సు సిలబస్ పూర్తి కాని కారణంగా దాని కాలాన్ని పొడిగించాలని కోరుతూ ఎస్సీ స్టూడెంట్స్ అండ్ హాస్టల్స్ ఆర్గనైజేషన్ నాయకులు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు మప్పూరి కుమార్ నాయకత్వంలో ప్రతినిధులు మంత్రి కలిసి సమస్యలను వివరించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు పెండింగ్‌లో ఉన్న నూతన హాస్టళ్లను ప్రారంభించాలని కోరారు. వాటికి నాసిరకమైన సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. వెంటనే నాణ్యమైన పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారనీ, సంబంధిత కమిషనర్ నుఆదేశించారని తెలిపారు.