Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ
- 2,683 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
- 6,29,352 మంది దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల 12న జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సర్వంసిద్ధమైంది. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్న 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ పేపర్-1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది కలిపి మొత్తం 6,29,352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. పేపర్-1కు 1,480, పేపర్-2కు 1,203 కలిపి మొత్తం 2,683 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లి అభ్యర్థులు చూసుకోవాలని సూచించారు. గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు తెచ్చుకునేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు.
బ్లాక్‌బాల్ పాయింట్ పెన్నును వినియోగించాలని తెలిపారు. హాల్‌టికెట్లపై అభ్యర్థుల ఫొటో, సంతకం లేకపోతే ఆధార్ లేదంటే ఇతర గుర్తింపు కార్డుతో సంబంధిత జిల్లా డీఈవోలను సంప్రదించాలని సూచించారు. వాటిని పరిశీలించి అభ్యర్థి ఫొటోను సంతకాన్ని హాల్‌టికెట్‌పై ఉంచాలని కోరారు. అభ్యర్థులు ఉదయం 12 గంటల్లోపు, సాయంత్రం ఐదు గంటల్లోపు పరీక్షా కేంద్రాల నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో అధికంగా అభ్యర్థులు
టెట్‌కు హైదరాబాద్‌లో అత్యధికంగా అభ్యర్థులు హాజరవుతున్నారని రాధారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో పేపర్-1కు 27,978 మందిగాను 117, పేపర్-2కు 22,622 మందికి 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరిచారు. ఆ తర్వాత నల్లగొండలో పేపర్-1కు 22,936 మందికి 96, పేపర్-2కు 20,543 మందికి 87, రంగారెడ్డిలో పేపర్-1కు 21,264 మందికి 89, పేపర్-2కు 17,583 మందికి 75, మహబూబ్‌నగర్‌లో పేపర్-1కు 18,923 మందికి 79, పేపర్-2కు 13,719 మందికి 58, ఖమ్మంలో పేపర్-1కు 18,514 మందికి 78, పేపర్-2కు 15,004 మందికి 64, కరీంనగర్లో పేపర్-1కు 16,936 మందికి 71, పేపర్-2కు 15,393 మందికి 65, సంగారెడ్డిలో పేపర్-1కు 16,790 మందికి 70, పేపర్-2కు 12,359 మందికి 53, నిజామాబాద్‌లో పేపర్-1కు 16,454 మందికి 69, పేపర్-2కు 12,462 మందికి 53, హన్మకొండలో పేపర్-1కు 13,752 మందికి 58, పేపర్-2కు 12,377 మందికి 53, సూర్యాపేటలో పేపర్-1కు 13,715 మందికి 58, పేపర్-2కు 11,996 మందికి 51, నాగర్‌కర్నూల్‌లో పేపర్-1కు 11,216 మందికి 47, పేపర్-2కు 8,495 మందికి 37, మంచిర్యాలలో పేపర్-1కు 11,161 మందికి 47, పేపర్-2కు 7,932 మందికి 34, సిద్ధిపేటలో పేపర్-1కు 10,019 మందికి 42, పేపర్-2కు 7,816 మందికి 34 చొప్పున పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
టెట్ దరఖాస్తుల వివరాలు
దరఖాస్తులు పరీక్షా కేంద్రాలు
పేపర్-1 3,51,468 1,480
పేపర్-2 2,77,884 1,203
మొత్తం 6,29,352 2,683