Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏ-సీపీటీకి శిక్షణ
- ప్రారంభించిన విద్యామంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పూర్తి విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏ-సీపీటీకి హాజరయ్యే విద్యార్థులకు కోచింగ్ ఇస్తామని చెప్పారు. కరోనా నేపథ్యంలోనూ గతేడాది ఎంసెట్, నీట్, జేఈఈ షార్ట్‌టర్మ్ కోచింగ్ ఇచ్చామని అన్నారు. 20 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. ఏటా రెండు వేల మందికిపైగా విద్యార్థులు ర్యాంకులు సాధించి సీట్లు పొందుతున్నారని చెప్పారు. ఈ ఏడాది ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏ-సీపీటీకి దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా కోచింగ్ ఇస్తామని అన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విద్యార్థులకు ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ఇంటర్ హాల్‌టికెట్ నెంబర్‌ను పాస్‌వర్డ్‌గా భావించి https//www.tscie.rankr.com వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఆ తర్వాత వారు కోర్సును ఎంచుకుని మాక్‌టెస్టులు రాయొచ్చని సూచించారు.ఈ సౌకర్యం ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ఎయిడెడ్, ప్రయివేటు కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. డిపార్ట్మె ంట్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఈ లెర్నింగ్ తెలంగాణ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియో పాఠాలను అందిస్తున్నామని వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.