Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రూప్ 2, 3,4, డీఎస్సీ, గురుకులాల ఉద్యోగ పరీక్షలకు శిక్షణ తీసుకునే వారికి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. గ్రూప్- 2,3,4 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీలో మొదటి శ్రేణిలో, డీఎస్సీ, గురుకులాలకు దరఖాస్తు చేసుకునేందుకు 60 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు.