Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల నిర్మూలన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ కార్యాలయంలో మంగళవారం ఆయా జంటలకు సంఘం ఆర్గనైజింగ్ అధ్యక్షులు మహమ్మద్ వహీద్, సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మహమ్మద్ వహీద్ మాట్లాడుతూ తాను హిందూ అమ్మాయి జ్యోతిని కుల, మతాంతర వివాహం చేసుకు న్నట్టు తెలిపారు. పిల్లలు కూడా వారికి నచ్చిన వారినే చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వారి కి అండగా ఉండేందుకు 'కులనిర్మూలన సంఘం' ఏర్పడిందని తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో 50 ప్రేమ వివాహాలు జరిపి వారికి అండగా నిలి చామని పేర్కొన్నారు. ఇటివల జరిగిన కులోన్మాద హత్యలను పరిశీలిస్తే కుల, మతాంతర వివాహం చేసుకున్న వారికి మెరుగైన రక్షణ కల్పించా లని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమిషన్కు వినతి పత్రం అందిం చినట్టు తెలిపారు. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు అండగా ఉంటామని జస్టిస్ చంద్రయ్య హామీ ఇచ్చినట్టు తెలిపారు.