Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో నేరం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయకుండా..న్యాయం కోసం పోరాడుతున్న తమ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్, ఆ పార్టీ శాసనసభాపక్షనేత రాజాసింగ్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. లైంగికదాడి ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ఈ తరహా లైంగికదాడి ఘటనలు రోజుకో కొత్త కేసు వెలుగు చూడటం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమన్నారు. నేరాలను అరికట్టడంలో మేమే నెంబర్‌వన్ అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ గొంతు ఎందుకు మూగబోయిందని ప్రశ్నించారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదనీ, దోషులను శిక్షించే వరకు పోరాడుతామని చెప్పారు.
టీఆర్ఎస్, ఎంఐఎంకి బీటీమ్‌గా కాంగ్రెస్ : డీకే
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పై పోలీసులు కేసు నమోదు చేయడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఒక ప్రకటనలో ఖండించారు. జూబ్లీహిల్స్ లైంగిక దాడి ఘటనలో అసలు నిజాలను సాక్ష్యాలతో సహా వెలుగులోకి తెచ్చిన రఘునందన్‌రావుపై పోలీసులు కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిందితులకు సంబంధించిన వారి పై పోరాడకుండా, బీజేపీ కార్యాలయం, ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై విమర్శలు చేయడం దేనికి సంకేతమని డీకే అరుణ ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎంకి బీటీమ్‌గా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు.