Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని క్యాం పు కార్యాలయంలో ఆయన మాట్లా డుతూ న్యూఢిల్లీలోని ఎన్సీఆర్లో జరిగిన క్రీడల్లో తెలంగాణ జట్టు క్రీడా కారులు విజయం సాధించటం అభి నందనీయమన్నారు. మే 28 నుంచి 31 వరకు జరిగిన 17వ ఐసీఈ స్కేటింగ్ నేషనల్ చాంపియన్ షిప్ 2022లో తెలంగాణ జట్టు క్రీడాకారు లు వివిధ విభాగాల్లో బంగారు-4, సీల్వర్ 1, బ్రాంజ్-2 పతకాలు సాధిం చటం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా కోచ్‌లను, అసోసియేషన్ నాయకులను అభినందించారు.