Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకున్న డైరెక్టర్ రామేశ్వర్రావు
- గర్వంగా ఉంది : డైరెక్టర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ)కు 'గోల్డెన్ పీకాక్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు-2021' దక్కింది. ఇప్పటి వరకు ఈస్కీ ఆరు గోల్డెన్ పీకాక్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇది ఏడోది కావడం విశేషం. ఈ అవార్డును ఈనెల 3వ తేదీన ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ చేతుల మీదుగా ఈఎస్సీఐ డైరెక్టర్ జి.రామేశ్వర్రావు అందుకున్నారు. ఈఎస్‌సీఐకి గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కడం గర్వకారణంగా ఉందని డైరెక్టర్ జి.రామేశ్వర్రావు తెలిపారు. 1981 ఏర్పాటైన ఈఎస్సీఐ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, పర్యావరణ రంగంలో క్వాలిటీ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ అందిస్తోందన్నారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఆర్గాన్ అయిన ఈఎస్సీఐ స్వతంత్ర సంస్థగా జాతీయ స్థాయిలో అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.