Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రీయ కిసాన్ మహాసంఘం తీర్మానం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఢిల్లీలో సుదీర్ఘ కాలంపాటు జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చిందని జాతీయ రాష్ట్రీయ కిసాన్ మహాసంఘం గుర్తు చేసింది. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయడంగానీ, ప్రతి పంటకు కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని రూపొందించేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పేర్కొంది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యతు కార్యాచరణ రూపొందించేందుకు మంగళవారం ఢిల్లీలో రాకాబ్గంజ్ గురుద్వారా సమావేశ మందిరంలో రాష్ట్రీయ కిషన్ మహా సంఘం జాతీయ స్థాయి రైతు సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి జాతీయ రైతు నేత శివకుమార్ కక్కాజీ అధ్యక్షత వహించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రైతు సంఘాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా డబ్య్లూటీవో నుంచి భారత్ వైదొలగాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
ఈ సందర్భంగా దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు మాట్లాడుతూ ఉద్యమ కార్యాచరణకు తమ వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలను ప్రస్తావించారు.