Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 1, 2, 5 లలో లభ్యం
- తమ శాఖల ద్వారా ఎస్బీఐ పంపిణీ
హైదరాబాద్ : 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'కు అంకితం చేస్తూ ప్రధాని మోడీ ఆవిష్కరించిన ప్రత్యేక శ్రేణి నాణేలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. రూ. 1, రూ. 2, రూ.5 విలువ గల ఈ నాణేలను ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ హైదరాబాద్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, చాంద్రాయణగుట్ట, ఐడీపీఎల్, కూకట్పల్లి, వనస్థలి పురం కాంప్లెక్స్, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, మేడ్చల్, ఇక్రిశాట్ పటాంచెరువు లలోని బ్రాంచ్ల ద్వారా వీటిని కస్టమర్లకు, ప్రజలకు అందించే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నాణేలపై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిజైన్ ఉంటుంది. జ్ఞాపకార్థకం కోసం కాకుండా సాధారణ చలామణి కోసం వీటిని తీసుకొచ్చారు. ఈ నాణేలు కావాలనుకునే కస్టమర్లు, ప్రజలు ఈ బ్రాంచ్లను సంప్రదించాలని ఎస్బీఐ స్థానిక ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది.