Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల హర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా నమోదు చేసిన పిటిషన్ 23379/ 2022ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఈ నిర్ణయం పట్ల జీవో నెంబర్ 16, కాంట్రాక్టు ఉద్యోగులు/ అధ్యాపకుల క్రమబద్ధీ కరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ హర్షం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చలరర్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 16ను రద్దు చేయాలంటూ వి ఉమేష్‌తోపాటు మరో ముగ్గురు వేసిన పిటిషన్ 23379/2022పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ అభినందన్‌కుమార్ షావలితో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా 20 ఏండ్లకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులు పనిచేస్తున్నారనీ, వారి సర్వీసులు క్రమబద్ధీకరించవద్దా?అని పిటిషనర్లను ఆ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయంపై మాటి, మాటికీ కేసులు వేయడం సమంజసం కాదని సూచించింది. అనంతరం ఆ పిటిషన్‌ను కొట్టేసింది.
సీఎం జోక్యం చేసుకోవాలి
రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు జోక్యం చేసుకోవాలనీ, క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంగళవారం ఆన్లైన్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటానికి చూస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శ్రమదోపిడీకి గురవుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరించడానికి సీఎం 2016లో జీవో నెంబర్ 16 జారీ చేశారని తెలిపారు. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ విషయంపై హైకోర్టులో వేసిన కేసు వల్ల దాదాపు ఆరేండ్లపాటు క్రమబద్ధీకరణ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయిందని పేర్కొన్నారు. 2021, డిసెంబర్లో క్రమబద్ధీకరణకు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయని గుర్తు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ జాబితా గురించి మూడు నెలల క్రితం అన్ని శాఖలకూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు పంపిందని తెలిపారు. కానీ ప్రధానమైన వైద్య ఆరోగ్య శాఖ, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల కమిషనరేట్ నుంచి ఇంతవరకూ సంబంధిత జాబితా సచివాలయానికి పంపించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ శాఖల్లో కొంతమంది అనధికార వ్యక్తులు, కొందరు అధికారులను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశపూ ర్వకంగా జాబితా పంపించడంలో జాప్యం చేయిస్తు న్నారని విమర్శించారు. కొంతమంది దళారుల చేత కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను భయపెడు తూ డబ్బులు వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలిపారు. క్రమబద్ధీకరణ జాప్యం చేయడానికి కొంద రికి డబ్బులిచ్చి న్యాయస్థానాల్లో కేసులు వేయిస్తు న్నారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే లా చర్యలు తీసుకోవాలని సమితి కోకన్వీనర్లు శ్రీనివాస్, శోభన్‌బాబు, ఉదయభాస్కర్ కోరారు.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న తెలిపారు. కొందరు ఈ ప్రక్రియను అడ్డుకోవాలనే ఉద్దేశంతో కేసులు వేస్తున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు.