Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగికదాడులపై నిరసనగా నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళన
- డీజీపీకి నేతల ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళలు, మైనర్లపై జరుగుతున్న లైంగికదాడులకు నిరసనగా మహిళా కాంగ్రెస్ మౌనదీక్ష చేపట్టింది. మూతికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపింది. అనంతరం ఇదే అంశంపై డీజీపీ మహేందర్‌రెడ్డికి నేతలు ఫిర్యాదు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మౌన దీక్షలో జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు నెట్టా డిసౌజా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనన్నారు. జూబ్లీహిల్ ఘటనలో బాధితురాలు వీడియోను బీజేపీ ఎమ్మెల్యే ఎలా బహిర్గతం చేస్తారని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర అధ్యక్షులు సునీతారావు పాల్గొన్నారు.