Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాపయ్య చౌదరి నూతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అమెరికాలోని తెలుగువారికి సేవలందించడమే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) లక్ష్యమని ఆ సొసైటీ అధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో నిర్వహించిన ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కష్టకాలంలో అమెరికాలో పేదలకు అండగా నిలిచామనీ, ఉచిత వైద్య శిబిరాలు, అన్నార్తుల ఆకలి తీర్చడంతో పాటు బాలల సంబరాలు తదితర కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు.
క్రీడా సంబరాలు, మహి ళా సంబరాలు, అమెరికాలో తెలుగు వారి మధ్య సంబంధాలు, ఆన్లైన్ సదస్సులు కొనసాగిస్తున్నామని తెలిపారు. తెలుగు భాష పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ నెల 19న గుంటూరు జిల్లా పెదనంది పాడులో శంకర నేత్రాలయంతో కలిసి కంటి వైద్య శిబిరం నిర్వహిం చనున్నట్టు నూతి చెప్పారు. ఈ సమావేశంలో నాట్స్ బోర్డు వైస్‌చైర్మెన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల పాల్గొన్నారు.